hyderabad
కీసర గుట్టలో చూడవలసిన ప్రదేశాలు
కీసర గుట్ట
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలోని కీసరలో వున్న ఒక గుట్ట. ఈ గుట్టపై వున్న దేవాలయాన్ని
కీసర గుట్ట క్షేత్రం అని పిలుస్తారు. ఇక్కడ ఈశ్వరుడు కొలువై వున్నారు. ఈ కీసర క్రీ. శ 4 – 5
శతాబ్ధాలలో ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన విష్ణుకుండిన రాజులకు రాజధానిగా
విలసిల్లింది. ఆ రాజవంశానికి చెందిన రెండవ మాధవ వర్మ 11 అశ్వమేధయాగాలు ఇంకా 1000
ఇతర యాగాలు నిర్వహించి, నర్మదా తీరం వరకు తన
సామ్రాజ్యాన్ని విస్తరించిన గొప్పరాజు. ఈ ప్రాంతం హైదరాబాద్ నగరం నుండి దాదాపు 30 km దూరంలో వుంది. మహా శివరాత్రి, కార్తీక మాసం సందర్బంగా
లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు.
ఆ తరువాత హనుమంతుడు 101 శివలింగములను తీసుకువస్తాడు కానీ అప్పటికే లింగ ప్రతిష్ట జరగడంతో ఆవేశంతో తాను తెచ్చిన 101 శివలింగములను తన తోకతో విసిరివేస్తాడు. ఆ శివలింగాలన్నీ ఇక్కడి పరిసర ప్రాంతంలలో అక్కడక్కడా చెల్లాచదురుగా పడినవి. ఇప్పటికీ కూడా ఈ శివలింగాలను ఇక్కడ దర్శించవచ్చు. ఆ తరువాత హనుమంతుడిని శాంతింపజేయుటకు ఈ క్షేత్రము ఆచంద్రతారార్కం హనుమంతుడి తండ్రి గారి పేరు మీద “ కేసరి గిరిగా ” ప్రసిద్ది చెందుతుందని ఆ శ్రీ రాముల వారు ఆశీర్వదించెను. దాంతో హనుమంతుడు శాంతించి తాను తెచ్చిన 101 శివలింగములలో ఒక దానిని ఇక్కడి స్వామి వారి వామ భాగంలో ప్రతిష్టించారు. అదే “ మారుతీ కాశీ విశ్వేశ్వరాలయం ” అని ఇక్కడ పిలువబడుతుంది. కాలక్రమేన కేసరిగిరి క్షేత్రం “ కీసర గుట్టగా ” మారింది.
కీసర గుట్ట చరిత్ర :
త్రేతాయుగంలో అయోద్య నగరాన్ని పాలించిన శ్రీ రాముడు సీతాదేవి మరియు హనుమంతులతో వనవిహారమునకై వచ్చి, ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆనంద భరితుడై ఈ ప్రాంతంలో ఒక శివలింగాన్ని ప్రతిష్టించడానికి నిశ్చయించారు. ఈ విషయమై అరణ్య ప్రాంతం లోని మహర్షులను సంప్రదించగా వారు సంతోషించి శివలింగ ప్రతిష్టాపన కోసం ఒక సుముహూర్తాన్ని నిర్ణయించారు. అప్పుడు శ్రీ రామచంద్రుల వారు హనుమంతున్ని కాశీ క్షేత్రమునకు వెళ్ళి ఒక శివలింగమును తీసుకొని రావలసినదిగా ఆజ్ఞాపిస్తారు. అప్పుడు హనుమంతుడు ఆకాశ మార్గాన కాశీ క్షేత్రానికి వెళ్ళగా అక్కడ ఆ పరమేశ్వరుడు 101 శివలింగముల రూపంలో దర్శనమిచ్చారు. అప్పుడు హనుమంతుడు ఏ శివలింగాన్ని తీసుకువెళ్లాలో తెలియక ఆ పరమేశ్వరున్నీ ప్రార్థించి ఆ 101 శివలింగములన్నింటిని తీసుకొని బయలుదేరాడు. కానీ హనుమంతుడు శివలింగమును తీసుకురాకముందే ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుముహూర్తము సమీపిస్తుండగా శ్రీ రాముల వారు ఆ పరమేశ్వరున్నీ ప్రార్థించగా ముహూర్త సమయమునకు ఆ పరమేశ్వరుడు ప్రత్యేక్షమై శివలింగ రూపమును ధరించారు. శ్రీ సీతారామచంద్రులు ఆ శివలింగమును ప్రతిష్టించి అభిషేకించారు. అందువల్లన ఈ స్వామికి “ శ్రీ రామ లింగేశ్వర స్వామి ” అని పేరు వచ్చింది.ఆ తరువాత హనుమంతుడు 101 శివలింగములను తీసుకువస్తాడు కానీ అప్పటికే లింగ ప్రతిష్ట జరగడంతో ఆవేశంతో తాను తెచ్చిన 101 శివలింగములను తన తోకతో విసిరివేస్తాడు. ఆ శివలింగాలన్నీ ఇక్కడి పరిసర ప్రాంతంలలో అక్కడక్కడా చెల్లాచదురుగా పడినవి. ఇప్పటికీ కూడా ఈ శివలింగాలను ఇక్కడ దర్శించవచ్చు. ఆ తరువాత హనుమంతుడిని శాంతింపజేయుటకు ఈ క్షేత్రము ఆచంద్రతారార్కం హనుమంతుడి తండ్రి గారి పేరు మీద “ కేసరి గిరిగా ” ప్రసిద్ది చెందుతుందని ఆ శ్రీ రాముల వారు ఆశీర్వదించెను. దాంతో హనుమంతుడు శాంతించి తాను తెచ్చిన 101 శివలింగములలో ఒక దానిని ఇక్కడి స్వామి వారి వామ భాగంలో ప్రతిష్టించారు. అదే “ మారుతీ కాశీ విశ్వేశ్వరాలయం ” అని ఇక్కడ పిలువబడుతుంది. కాలక్రమేన కేసరిగిరి క్షేత్రం “ కీసర గుట్టగా ” మారింది.
కీసర గుట్టలో చూడవలసిన ప్రదేశాలు :
- శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం
- మారుతీ కాశీ విశ్వేశ్వరాలయం
- శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
- శ్రీ సీతారామస్వామి ఆలయం
- శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ( ఆలయం )
- హనుమంతుడు తెచ్చిన 101 శివలింగాలు
- తామర కొలను
- సీతమ్మ వారి గుహ
- కీసర గుట్ట పార్కు
- జైన, బౌద్ధ ప్రాంతాలు మొదలైనవి.
శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం :
కీసర గుట్ట లోని ప్రధాన ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో వున్న శివలింగమును సాక్షాత్తు శ్రీ సీతారామచంద్రుల వారు ప్రతిష్టించి పూజించారు. అందువల్లన ఈ స్వామికి “ శ్రీ రామ లింగేశ్వర స్వామి ” అని పేరు వచ్చింది.మారుతీ కాశీ విశ్వేశ్వరాలయం :
హనుమంతుడు తెచ్చిన 101 శివలింగములలో ఒక దానిని ఇక్కడి స్వామి వారి వామ భాగంలో ప్రతిష్టించారు. అదే “ మారుతీ కాశీ విశ్వేశ్వరాలయం ” అని ఇక్కడ పిలువబడుతుంది.శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మరియు శ్రీ సీతారామస్వాముల వారి ఆలయం :
క్రీ. శ 17 వ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్ షాహీ వంశం లోని “ అబ్దుల్ హాసన్ తానీషా ” నవాబు వద్ద మహామంత్రులుగా వున్న అక్కన్న మాదన్నలు ఈ కేసరి గిరి “ శ్రీ రామలింగేశ్వర స్వామి ” వారిని దర్శించి ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రంగా అభివృద్ది చేయదలచి ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయంలో శ్రీ లక్ష్మినరసింహ స్వామి మరియు శ్రీ సీతారామస్వాముల వారి విగ్రహాలను ప్రతిష్టించారు. ఇంకా ఈ కీసర గుట్ట ఆలయంలో భవానీ అమ్మవారు, శివదుర్గా అమ్మవార్లు కొలువై భక్తుల కోర్కెలను తీరుస్తున్నారు.శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం :
ఈ కీసర గుట్ట పైన ప్రధాన ఆలయానికి ఎదురుగా పర్యాటకులను ఆకర్శించడానికి ఒక పెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహానికి మరియు ప్రధాన ఆలయం చుట్టు పక్కల హనుమంతుడు తెచ్చిన 101 శివలింగాలు వున్నాయి.హనుమంతుడు తెచ్చిన 101 శివలింగాలు :
శ్రీరాముల వారు ఈ కీసర గుట్ట ప్రాంతంలో ఒక శివలింగాన్ని ప్రతిష్టించాలనుకొని, హనుమంతున్ని కాశీ క్షేత్రమునకు వెళ్ళి ఒక శివలింగమును తీసుకొని రావలసినదిగా ఆజ్ఞాపిస్తారు. అప్పుడు హనుమంతుడు కాశీ క్షేత్రం నుండి 101 శివలింగములను తీసుకువస్తాడు. కానీ అప్పటికే ఆలస్యం అవ్వడంతో శ్రీ రాముల వారు వేరే లింగ ప్రతిష్ట చేస్తారు. దాంతో హనుమంతుడు ఆవేశంతో తాను తెచ్చిన 101 శివలింగములను తన తోకతో విసిరివేస్తాడు. ఆ శివలింగాలన్నీ ఇక్కడి పరిసర ప్రాంతంలలో అక్కడక్కడా చెల్లాచదురుగా పడినవి. ఇప్పటికీ కూడా ఈ శివలింగాలను ఇక్కడ దర్శించవచ్చు.తామర కొలను :
ఈ కీసర గుట్ట ప్రాంతం లోనే “ సీతాసరోవరంగా ” పిలువబడే ఒక తామర కొలను కూడా వుంది. ఇక్కడి ఆంజనేయ స్వామి వారి విగ్రహం వెనుక గుట్టకు క్రింది భాగంలో ఈ కొలను వుంటుంది.సీతమ్మ వారి గుహ :
శ్రీ రాముల వారు రావణాసురున్నీ వధించిన తరువాత ఈ కీసర గుట్ట ప్రాంతానికి వస్తారు. వారు ఈ ప్రాంతంలో వున్నప్పుడు సీతమ్మ వారు ఈ గుహలోనే తపస్సు చేసేవారు. ఈ గుహ ఇక్కడి ప్రధాన ఆలయానికి కుడి వైపు దిగువ భాగంలో వుంటుంది. ప్రస్తుతం ఈ గుహ మహిషాసురమర్దిని ఆలయంగా మారింది.కీసర గుట్ట పార్కు :
ఈ క్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా మంచి ప్రకృతి రమణీయ ప్రాంతంగా కూడా వుంటుంది. వర్షాకాలంలో లేదా చలి కాలంలో ఈ కొండపై నుండి చూస్తే పచ్చని ప్రకృతి మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ ప్రకృతి అందాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అందమైన పార్కును నిర్మించింది. ఈ పార్కు ప్రధాన ఆలయ దిగువ భాగంలో వుంటుంది. ఈ కీసర గుట్ట కింది భాగంలో పలు ఆశ్రమాలు మరియు యోగా కేంద్రాలను ఏర్పాటు చేశారు.జైన, బౌద్ధ అవశేషాలు :
ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో పురావస్తు శాఖ త్రవ్వకాలు జరిపింది. అప్పుడు జైన మతం, బౌద్ధ మతంకు సంభంధించిన కొన్ని
అవశేషాలు ఇక్కడ బయటపడ్డాయి. అందులో 4 – 5 వ శతాబ్ధం నాటి జైన తీర్థంకరుడి 12
విగ్రహాలు ఇక్కడ కనుగొనబడ్డాయి.ఇతర ప్రదేశాలు :
కీసర గుట్ట పైన మరియు ప్రక్కన మరో గుట్ట పైన నిజాముల కాలంలో కట్టిన ద్వారాలు వున్నాయి. అంతే కాకుండా విష్ణుకుండినుల కాలంనాటి మరికొన్ని ఇటుక నిర్మాణాలు ఇక్కడ వున్నాయి.మరింత సమాచారం :
కీసర గుట్ట ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెరిచే వుంటుంది. ఇక్కడ వసతి కోసం ttd వారి ధర్మశాల వుంది. మహా శివరాత్రి రోజు చాలా మంది భక్తులు ఈ ఆలయానికి వస్తారు. ఆ రోజు భక్తులు ఎవరికి వారు ఇక్కడి 101 శివలింగాలలో ఒక్కొక్క శివలింగాన్ని ఎంచుకొని స్వహస్తాలతో ఆ స్వామి వారికి అభిషేకం చేసి, విభూది పూసి, బొట్టు పెట్టి, పూల మాలలు వేసి పూజిస్తారు.ఎలా చేరుకోవాలి ?
రోడ్డు మార్గం : ఈ క్షేత్రం జంట నగరాలకు అతి సమీపంలో వుంది. జంట నగరాల లోని సికింద్రాబాద్, ECIL, అఫ్జల్ గంజ్ నుండి చాలా బస్సులు అందుబాటులో వున్నాయి. మరియు ఇతర ప్రైవట్ వాహనాలు కూడా అందుబాటులో వున్నాయి. కీసర గుట్ట ఆలయం హైదరాబాదు నుండి 35 km మరియు ECIL X రోడ్డు నుండి 18 km దూరంలో వుంది.రైలు మార్గం : ఈ ఆలయానికి సమీపం లోని రైల్వే స్టేషన్ ఘట్కెసర్. ఘట్కెసర్ రైల్వే స్టేషన్ నుండి కీసర గుట్ట ఆలయం దాదాపు 15 km దూరంలో వుంటుంది. ఇంకొక ప్రధాన రైల్వే స్టేషన్ సికింద్రాబాదు.
విమానాశ్రయాలు : ఈ ఆలయానికి సమీప విమానాశ్రయం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇంకా మీకు ఏమైనా సమాచారం కావలసి వుంటే క్రింద కామెంట్ చేయండి.
గమనిక : మా ఆర్టికల్ చదివినందుకు ధన్యవాదాలు !

కామెంట్‌ను పోస్ట్ చేయండి
0 కామెంట్‌లు